రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని మార్కెట్ యార్డ్ సొసైటీ( Market Yard Society ) ఆధ్వర్యంలో హడావిడిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ తూకం (కంట) వేయడం మారిచారని వెంటనే వరి ధాన్యం తూకం వేయడం ప్రారంభించాలని కోరుతూ రుద్రంగి కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్( Tarre Manohar ) మాట్లాడుతూ హడావిడిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ తూకం వేయడం మారిచారని అన్నారు.
పక్కా మండలాల్లో తూకం వేయడం ప్రారంభించి ధాన్యాన్ని కూడా లారీల్లో తరలిస్తున్నారని కానీ రుద్రంగిలో మాత్రం ఇప్పటివరకు తేమ శాతం చూడకుండా తూకం వేయకుండా జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.వర్షం ఎప్పుడు పడుతుందో అని రైతులు కొనుగోలు కేంద్రాల్లో కునుకులేకుండా ధాన్యానికి కాపలా ఉంటున్నారని అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు రైతుల బాధలు పట్టవా అని అన్నారు.
వెంటనే అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో,డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి, పల్లి గంగాధర్,ఎర్రం గంగనర్సయ్య, మడిశెట్టి అభిలాష్,గడ్డం శ్రీనివాస్,తర్రె లింగం,ధర్నా మల్లేశం,అక్కినపెళ్లి శ్రీనివాస్,కట్కూరి దాసు, దయ్యాల శ్రీనివాస్,బైరి గంగారాం,తదితరులు పాల్గొన్నారు.