ఎన్నికల ముందు హడావుడిగా శిలా ఫలకాలు-అంతలోనే కూలిపోయిన వైనం

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల మండలం బంటువారిగూడెం స్టేజి వద్ద గత బీఆర్ఎస్ హయాంలో ఆనాటి సాగర్ ఎమ్మేల్యే నోముల భగత్ కుమార్ హడావుడిగా వేసిన శిలా ఫలకం కూలిపోయి,గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెకత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

ఎన్నికల కోడ్ కు ముందు చేసిన హడావుడిలో భాగంగా శిలాఫలకం పిడబ్ల్యూ రోడ్డు నుండి బంటువారిగూడెం వరకు, ఎస్డీఎఫ్ నిధుల నుండి బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మూడు నెలలు కూడా తిరగకముందే శంకుబండ కూలిపోయింది.మరి ఇప్పుడైనా రోడ్డైనా ఈ ఊర్లోకి నిర్మిస్తారా?ఎన్నికల స్టంట్ గానే మిగిలిపోయే అవకాశం ఉందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Stone Slabs In A Hurry Before The Elections - And Then Collapsed-ఎన్ని

Latest Nalgonda News