బుల్లితెర యాంకర్ అనసూయకు( Anasuya ) సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అనసూయను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే అనసూయ తాజాగా రిలీజ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.అనసూయ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలోనే ఉంది.
అనసూయ తాజాగా ఏడుస్తూ వీడియో చేయగా ఆ వీడియో వైరల్ అయింది.అయితే శ్రీరెడ్డి( Srireddy ) ఆ వీడియో గురించి స్పందిస్తూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
అయితే నెట్టింట ఈ వీడియో హాట్ టాపిక్ కాగా ఈ వీడియో గురించి శ్రీరెడ్డి స్పందిస్తూ ఎందుకురా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ట్విట్టర్ వేదికగా శ్రీరెడ్డి స్పందిస్తూ ఈ కామెంట్లు చేశారు.
అనసూయ ఎందుకు ఏడుస్తుందో( Anasuya Crying ) చాలామందికి అర్థం కాలేదని శ్రీరెడ్డి పేర్కొన్నారు.సింపుల్ గా చెప్పాలంటే తను లోపల ఒకటి బయట ఒకటి కాకుండా తన మనస్సు ఏం చెబితే అలా సోషల్ మీడియాలో( Social Media ) భావాలను పంచుకుంటారని శ్రీరెడ్డి వెల్లడించారు.అనసూయ చెప్పేది నచ్చని వాళ్లు తనకు తప్పుగా కామెంట్లు చేస్తున్నారని శ్రీరెడ్డి అన్నారు.ఆ కామెంట్లు అనసూయను బాధిస్తున్నాయని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.
నా పోస్ట్ లకు కూడా చాలామంది దరిద్రమైన కామెంట్లు పెడుతున్నారని తప్పురా అలా చెయ్యకూడదు మంచిగా ఉందాం అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.శ్రీరెడ్డి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.అనసూయ గురించి వ్యంగ్యంగా శ్రీరెడ్డి కామెంట్లు చేయడం గమనార్హం.శ్రీరెడ్డి అనసూయను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.అనసూయ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా ఆ సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.