నేను పెద్ద పతివ్రతను కాదు.. పైగా లెక్కలు ఎందుకు : శ్రీకాంత్ అయ్యంగార్

శ్రీకాంత్ అయ్యంగార్( Srikanth Iyengar ).తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక వర్సటైల్ నటుడి గా పేరు ఉంది.

 Srikanth Ayyangar About His Bad Habits , Srikanth Iyengar, Rgv, Drinking , Cigar-TeluguStop.com

ఆర్జీవీ( RGV ) కి డూప్ లాగా ఈయన మాటలు జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.ఉన్నది ఉన్నట్టుగా ఏది దాచుకోకుండా తన చెడు అలవాట్ల గురించి, అలాగే తన తప్పుల గురించి మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూలలో చెప్తూ ఎప్పుడు సోషల్ మీడియా సంచలనం అవుతూ ఉంటాడు.

డాక్టర్ గా ఒక ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో తన ఫీల్డ్ వదిలేసుకుని వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బాగానే సెటిల్ అయ్యాడు.కేవలం నటన మాత్రమే కాదు రైటింగ్ మరియు డైరెక్షన్ పై కూడా ఇంట్రెస్ట్ తో ప్రస్తుతం శ్రీకాంత్ అయ్యగారు సినిమాలను తీసే ప్రయత్నంలో ఉన్నాడు.

Telugu Bad Habits, Cigarettes, Meat, Tollywood-Movie

ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకున్న అలవాట్ల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు శ్రీకాంత్.తను చాలామంది లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడనని తనకు దారుణమైన దౌర్భాగ్యమైన అలవాట్లు ఉన్నాయని పతివ్రతను ఏమాత్రం కాదు అంటూ తెలిపాడు శ్రీకాంత్.తన కుటుంబం కూడా తనతో ఉండలేక వదిలేసి వెళ్లిపోయారని ప్రతిరోజు తాగుతానని, పెట్టల కొద్ది సిగరెట్స్ కలుస్తానని, మాంసం కూడా తింటానని తెలుపుతున్నాడు.చాలామంది తనను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇలాంటి అలవాట్లు ఎలా చేసుకున్నావు అని అంటూ ఉంటారు కానీ బ్రాహ్మణుడిగా పుడితే అలవాట్లు చేసుకోకూడదని ఎక్కడైనా రాసి ఉందా అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు.

Telugu Bad Habits, Cigarettes, Meat, Tollywood-Movie

నాకు నచ్చినట్టు చేస్తాను అలాగే నాకు నచ్చినన్ని సిగరెట్స్ కాలుస్తాను.ఎన్ని సిగరెట్స్ కాలుస్తారని లెక్క కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు.చేసేదే చండాలమైన పని పైగా దానికి లెక్కలు ఎందుకు అంటూ యాంకర్ ని తిరిగి ప్రశ్నించాడు.శ్రీకాంత్ మాట్లాడిన ప్రతిసారి మరో ఆ జీవిని చూసినట్టుగా ఉంటుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉంటారు.

దీనివల్ల కెరియర్ ఏమైపోయినా పర్వాలేదు అని, ఎలా అయినా కూడా సినిమా లో నటిస్తున్నాను కాబట్టి దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ శ్రీకాంత్ చెప్పడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube