కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి( MLA Dwarampudi Chandrasekhar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలకి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు( Former TDP MLA Kondababu ), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై విమర్శలు చేయడం జరిగింది.
వచ్చే ఎన్నికలలో దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.కొండబాబు వచ్చే ఎన్నికలలో నువ్వు కాకినాడలో పోటీ చేయగలవా.? అసలు నీకు టికెట్ పార్టీ కేటాయించిందా.? అని ప్రశ్నల వర్షం కురిపించారు.వచ్చే ఎన్నికలలో గాజు గ్లాస్ పోటీ చేస్తుందని నేను భావిస్తున్నాను.
అలా లేని పక్షంలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తనపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టే అని ద్వారంపూడి వ్యాఖ్యానించారు.ఎన్ని చేసుకున్న.ఎవరొచ్చినా.
వచ్చే ఎన్నికలలో ఓడించడం మాత్రం గ్యారెంటీ అని అన్నారు.జనసేన అధినేత పవన్ వారాహి యాత్ర చేపట్టిన సమయంలో కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆ సమయంలో నీ పతనం మొదలైంది, మీ సామ్రాజ్యం మొత్తం కూల్చేస్తా.వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో ద్వారంపూడినీ గెలవనివ్వను.
నిన్ను ఓడిస్తా అని పవన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా వచ్చే ఎన్నికలలో తనపై పవన్ పోటీ చేయాలని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేయడం సంచలనంగా మారింది.