గ్రీవేన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ చందనా దీప్తి నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని,సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

వచ్చిన పిర్యాదుల్లో భూ సమస్యలు,భార్యభర్తల మధ్య విభేదాలు,ఫైనాన్స్ సమస్యలు ఉన్నాయని తెలిపారు.

ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని,ఫిర్యాదుదారునికి భరోసా,నమ్మకం కలిగించాలని అన్నారు.

SP Chandana Deepti Who Examined Many Complaints In Grievances, SP Chandana Deept

ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత
Advertisement

Latest Nalgonda News