అధికారుల పేర్లతో అడ్డగోలు దందాపై ఎస్పీ చందనా దీప్తి సిరియస్

జిల్లా అధికారుల పేర్లు( District Officers Name ) చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనా దీప్తి( SP Chandana Deepti ) సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

జిల్లాలో కొంతమంది వ్యక్తులు జిల్లా ఎస్పీ మరియు ఇతర ఉన్నతాధికారుల పేర్లు చెప్పుతూ అధికవడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో ప్రజల నుండి డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

అలాగే ఫేస్ బుక్( Facebook ), ఇన్స్తగ్రామ్ లాంటి వాటిలో ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి ఉన్నతాధికారుల పేర్లు చెప్పుతూ డ్యూటీ, ట్రాన్స్ఫర్ మీద వేరే వద్దకు వెళ్తున్నామని,ఇంట్లో ఫర్నిచర్ సామన్లు తక్కువ ధరకు ఇస్తామంటూ మోసాలకు ( Cheating )పాల్పడుతున్నారని,అలాంటి వాటికి స్పందిచకూడదన్నారు.ఇంకా జిల్లాలో కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు,కుల సంఘాలు,ఇతర ఆర్గనైజేషన్ పేర్లు చెప్పుతూ తమ స్వలాభాలకు,వ్యక్తి గత అవసరాలకు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆసరాగా చేసుకొని వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

SP Chandana Deepti Serious On Danda With The Names Of Officers,SP Chandana Deep

జిల్లా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దని,ఏదైనా సమస్య ఉంటే నేరుగా సంబంధిత అధికారుల వద్దకు రావలసిందిగా విజ్ఞప్తి చేశారు.ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడే వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని,ఇకనుంచి అలాంటి చర్యలకు స్పందించి ఇబ్బందులకు గురికావద్దని ప్రజలకు సూచించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

Latest Nalgonda News