పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఫిబ్రవరి 20న ఓట్లు వేయనున్నారు.నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కూడా ఈ ఎన్నికల బరిలో దిగారు.
మాళవిక సూద్ పంజాబ్‌లోని మోగా నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు.మాళవిక సూద్ అఫిడవిట్ జారీ చేస్తూ, తాను ఎన్నికైతే సివిల్ ఆసుపత్రి స్థాయిని మెరుగు పరుస్తానని తెలిపారు.మోగాలో యువత ఉపాధి కోసం పరిశ్రమలు ఏర్పాటు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యా స్థాయిని పెంచడానికి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడం, గృహిణుల రుణాలు మాఫీ వంటి అనేక వాగ్దానాలు చేశారు.
2022లో ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో మాళవిక సూద్ తనకు చరాస్తుల రూపంలో మొత్తం రూ.86,31,935 ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.ఇందులో పది లక్షల రూపాయల విలువైన కియా సెల్టోస్ కారు, ముప్పై తులాల బంగారం కూడా ఉన్నాయిని పేర్కొన్నారు.
ఎన్నికలకు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం మాళవికా సూద్‌కు 1,09,00,000 స్థిరాస్తులు ఉన్నాయి.ఇందులో రూ.35 లక్షల విలువైన ప్లాట్, రూ.34 లక్షల విలువైన వాణిజ్య భవనం, రూ.40 లక్షల విలువైన ఇల్లు కూడా ఉన్నాయి.ఈ అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం, మాళవిక సూద్‌పై ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదు.
మాళవిక సూద్, 39, 2005లో పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ, జలంధర్ నుండి కంప్యూటర్ అప్లికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.టీచర్‌గా వ్యాపారవేత్తగా మాళవిక రాణిస్తున్నారు.ఈ అఫిడవిట్‌లో మాళవిక మోగా అభివృద్ధి, ప్రగతి, సంక్షేమానికి సంబంధించి 20 ప్రతిపాదనలు పొందుపరిచారు.తనకు తన సోదరుడు సోనూసూద్ ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తుంటారని మాళవిక సూద్ తెలిపారు
.