Sivatmika Rajasekhar : అక్క ఎదుగుతుంటే శివాత్మిక రాజశేఖర్ తట్టుకోలేదా.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్( Hero Rajasekhar ) కూతుర్లు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అక్క చెల్లెలైన వీరిద్దరూ చూడటానికి ఎంతో అందంగా, చక్కగా, సాంప్రదాయంగా ఉంటారు.

 Sivatmika Rajasekhar Cant Stand It When Her Sister Grows Up What Happened-TeluguStop.com

అంతేకాకుండా ఇద్దరూ కలిసి మెలిసి చూడముచ్చటగా ఉంటారు.ఇద్దరు కలిసి పార్టీలని కూడా తిరుగుతూ ఉంటారు.

రాజశేఖర్ కూడా వారిద్దరినీ ఇండస్ట్రీకి హీరోయిన్ లుగా పరిచయం చేశారు.ఇక వీరిద్దరూ చిన్న చిన్న సినిమాలతో హీరోయిన్లుగా పరిచయం కాగా ఇంకా స్టార్ హోదాకు చేరుకోలేదు.

కానీ అందుకున్నంత వరకు మాత్రం బాగానే అవకాశాలు అందుకుంటున్నారు.చేసేవి చిన్న సినిమాలైనా కూడా తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు.

ఇక స్టార్ హోదాకు చేరుకోవటం కోసం బాగానే ప్రయత్నిస్తున్నారు.

Telugu Story, Jilebi, Prem Kumar-Movie

ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోవర్స్ ని కూడా సంపాదించుకున్నారు.ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా బాగా పంచుకుంటూ ఉంటారు.ఈమధ్య వీరిద్దరూ అందాలు ఆరబోయడానికి కూడా సిద్ధమయ్యారు.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను మెల్లిమెల్లిగా బయట పెడుతున్నారు.మొత్తానికి వీరిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒకే స్థానంలో ఉండగా.

ఒకరిని మించి మరొకరు టాలెంట్ చూపిస్తున్నారు.ఇద్దరూ పోటీపడుతూ ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో బాగా హడావుడి చేస్తున్నారు.

వారి మధ్య ఎంత పోటీ ఉన్న ఇద్దరు మాత్రం బాగానే కలిసి ఉంటారు.కానీ తాజాగా శివాత్మిక చేసిన పనికి కొన్ని అనుమానాలు దారి తీస్తున్నాయి.

అదేంటంటే శివాని రాజశేఖర్( Shivani Rajasekhar ) నటించిన జిలేబి సినిమా ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాతో పాటు ప్రేమ్ కుమార్ అనే సినిమా కూడా ఈరోజే విడుదలైంది.

Telugu Story, Jilebi, Prem Kumar-Movie

అయితే సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ సినిమా గురించి శివాత్మిక( Shivatmika ) తన ఇన్ స్టా స్టోరీలో పంచుకుంది.కానీ తన అక్క నటించిన జిలేబి సినిమా గురించి ఎటువంటి స్టోరీ పంచుకోలేదు.దీంతో అక్క ఎదుగుతుంటే చెల్లె చూసి తట్టుకోలేదేమో అని జనాలు అనుమానం పడుతున్నారు.ఎంతైనా సొంత అక్క సినిమా విడుదల అవుతుందంటే చాలు కచ్చితంగా అందరికీ తెలిసేలా చేస్తుంటారు.

తను మాత్రం తన అక్క సినిమా గురించి కాకుండా మరో హీరో సినిమా గురించి పెట్టడంతో జనాలు తనపై ఫైర్ అవుతున్నారు.సొంత అక్క సినిమా గురించి స్టోరీ పెట్టడానికి ఏమవుతుంది.

అంటే మీ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా.లేదా మీ అక్క ఎదుగుతుంటే నువ్వు చూడలేవా అని జనాలు ప్రశ్నల రూపంలో బాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆమె స్టోరీగా మెన్షన్ చేసిన ప్రేమ్ కుమార్ సినిమా ఫోటో బాగా వైరల్ అవుతుంది.ఇక శివాని రాజశేఖర్ తన సినిమా గురించి అందరికీ తెలియజేయడమే కాకుండా.

తను కూడా ప్రేమ్ కుమార్ సినిమా గురించి స్టోరీలో పంచుకుంది.ఇక ప్రస్తుతం శివాత్మిక చేసిన పనికి జనాలు అయితే ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube