Nalgonda Crime News : తల్లిని కాపాడబోయే ప్రయత్నంలో అన్నను చంపిన చెల్లెలు..!

తాగుడుకు బానిసైన( Alcohol Addict ) అన్న నిత్యం తాగొచ్చి తల్లిని,చెల్లిని వేధిస్తున్న క్రమంలో తల్లిని చంపేసేలా ఉన్నాడని భావించిన చెల్లెలు, తల్లిని రక్షించబోయి ఇనుప రాడ్ తో అన్న తలపై మోది హతమార్చిన ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్( Nagarjuna Sagar ) లో వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

సోమవారం గత రాత్రి సుమారు 11 గంటల సమయంలో సామళ్ల రమేష్ మద్యం మత్తులో కన్నతల్లి సామళ్ల బాలమ్మపై దురుసుగా ప్రవర్తిస్తూ చంపే ప్రయత్నం చేయగా అడ్డుగా వచ్చిన చెల్లి దాసరి సుశీలను కూడా కొట్టాడు.అన్న ప్రవర్తకు విసుగు చెందిన చెల్లి సుశీల ఆవేశంలో ఇనుప రాడ్ తీసుకొని అన్న తలపై మోదటంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest Nalgonda News