ప్రస్తుతం 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి టీటీడీలో పని చేసేటువంటి ఓ మహిళతో మాట్లాడినటువంటి సంభాషణ నెట్టింట్లో వైరల్ గా మారింది.దీంతో పృథ్విపై పలువురు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్నారు.
ఇప్పటికే రాజధాని విషయంలో అమరావతిలో దీక్ష చేస్తున్నటువంటి రైతులపై పృథ్వి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.దీనికి తోడు టీటీడీలో పనిచేసేటువంటి ఓ మహిళతో పృథ్వి ఫోన్లో మాట్లాడిన టువంటి సంభాషణ బయటికి రావడంతో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ కి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
బాధ్యత గల పదవిలో ఉంటూ ఇలాంటి పనులు చేయడం ఏంటని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా ఈ విషయంపై తాజాగా సీనియర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయనకు పదవి రాకముందు అందరితోనూ బాగానే ఉండేవాడని కానీ ఒక్కసారిగా పదవి రావడంతో ఇలా మారిపోయారని అన్నారు.అంతేగాక పృథ్వి తనకు ఒక మంచి స్నేహితుడని కానీ ఈ విషయంలో నేను అతనికి సపోర్ట్ చేయనని అతను చేసింది తప్పు అయితే కచ్చితంగా శిక్షించాలని అన్నారు.
అంతేగాక ఈమధ్య మొన్న జరిగినటువంటి మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగినటువంటి విషయంపై గూర్చి కూడా పృధ్విరాజ్ స్పందిస్తూ రోజురోజుకి మా లో పెద్ద రచ్చ అయిపోతుందని అనవసరంగా తిరుపతి నుంచి వచ్చానని కల్యాణి తో అన్నాడట. ఈ వ్యాఖ్యలు విని ఆమె ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
దీంతో ఆమె పృథ్విని వెంటనే మా అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని అన్నారు.ఎందుకంటే ఒక్కరే రెండు పదవీ బాధ్యతలలో ఉండకూడదని అయితే ఇప్పటికే పృథ్వీరాజ్ ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా కొనసాగుతున్నాడు.దాంతో మా సభ్యత్వానికి రాజీనామా చేయాలంటూ ఆమె కోరారు.ఒకవేళ తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నట్లయితే మేము క్షమాపణ చెబుతామని కరాటే కళ్యాణి అన్నారు.అయితే ఇది ఇలా ఉండగా ఆ మహిళతో ఫోన్లో మాట్లాడింది తాను కాదని ఎవరో తన వాయిస్ ని మిమిక్రీ చేసి తనని కావాలనే ఈ వివాదంలో ఇరికిస్తున్నారని తనకి ఏ పాపం తెలియదని పృథ్వీ ఆరోపిస్తున్నారు.