కొప్పోల్ పల్లె దావఖానలో మందుల కొరత

నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం కొప్పోల్ మేజర్ గ్రామంలోని పల్లె దావఖానలో మందులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు.

ఆసుపత్రికి వెళితే అక్కడ డ్యూటీలో ఆశా వర్కర్లు మాత్రమే ఉండడంతో పేషెంట్లు వారితో గొడవకు దిగుతున్నారు.

ఆసుపత్రి ప్రారంభంలో రెండు నెలలు మాత్రమే అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేవని,గత కొంత కాలంగా ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.ఆసుపత్రిలో మందులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించి జేబులు గుల్లచేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.ఇదే విషయమై మెడికల్ ఆఫీసర్ డా.భవాని చక్రవర్తిని వివరణ కోరగా మందుల కొరత ఉన్నది వాస్తవమేనని, ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రిలో అన్ని రకాల మందులను,సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Shortage Of Medicines In Koppol Village Davakhana, Medicines ,Koppol Village Da
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News