వేధిస్తున్న గన్ని బ్యాగుల కొరత?

నల్లగొండ జిల్లా:యాసంగి వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నడుమ పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే.

ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతుందని భావిస్తున్న తరుణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరొక సమస్య తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

సేకరించే ధాన్యానికి సరిపడా గన్నీ బ్యాగులు లేకపోవడంతో అధికారులను బ్యాగుల కొరత వేధిస్తున్నట్లు సమాచారం.ధాన్యం సేకరణలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు అవసరం ఉండగా,ప్రస్తుతం 8 లక్షల గోనే సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Shortage Of Harassing Gunny Bags?-వేధిస్తున్న గన్న

వాటిని కూడా మిల్లర్ల నుంచి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారని వినికిడి.వాస్తవానికి ధాన్యం సేకరణకు నెలరోజుల ముందే పౌరసరఫరాల శాఖ గన్నీ బ్యాగుల సేకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష
Advertisement

Latest Nalgonda News