మనకు ప్రస్తుత సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా సాయం కోరేవారు కనిపిస్తూ ఉంటారు.కొందరు పర్సు పోయిందనో లేదంటే తినడానికి ఏమీ లేవని ఏమైనా డబ్బులు ఇస్తే తింటామని చెబుతుంటారు.
కానీ ఇందులో చాలా వరకు మోసగాళ్లే ఎక్కువగా ఉంటారనే అనుమానంతో మనం ఇవ్వకుండానే వెళ్లిపోతూ ఉంటాం.కానీ ఎలాంటి ఫలితం ఆశించకుండా సాయం చేస్తే చివరకు మనకు అంతా మంచి జరుగుతుందని చెబుతుంటారు మన పెద్దలు.
అచ్చం ఈ సామెతకు అద్దం పట్టే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాలో జరిగిన ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే గనక ఇందులో ఓ మహిళ షాపింగ్ చేద్దామని దగ్గరలోని ఒక మాల్లో వెళ్తుంది.ఇక తనకు కావాల్సిన ఇంటి సరుకులు కొంటుండగా అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి ఆమెను హెల్ప్ అడుగుతాడు.
తాను ఇంటి దగ్గర పర్స్ మర్చిపోయానని తినడానికి డబ్బులు లేవని సాయం చేయాలని కోరుతాడు.ఇక ఆ మాటలకు చలించిపోయినా ఆ మహిళ సరే అని ఏమైనా కొనిచ్చేందుకు రెడీ అయిపోతుంది.
ఇక్కడే అసలు ట్విస్టు దాగుంది.ఇంతలోనే మనోడు ఆ మహిళను ఆశ్చర్యపరుస్తూ తాను ఏమీ మర్చిపోలేదని కేవలం మీ మంచితనం ఏంటో తెలుసుకుందామని ఇలా చేశానంటూ చెబుతాడు.అంతే కాదు ఆమె తీసుకున్న సరకులకు కూడా తానే మొత్తం బిల్లు కట్టేస్తానంటూ అలాగే చేస్తాడు.తన మాటలు విని కనీసం ఆలోచించకుండా ఆకలి తీర్చేందుకు రెడీ అయిన మీ మంచి మనసుకు హ్యాట్సఫ్ అంటూ చెబుతాడు.
ఇక ఆ అపరిచిత వ్యక్తి ఆ మహిళతో చేసిన ఫ్రాంక్ వీడియో నెట్టింట చూసిన వారంతా ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.