Srihari Imandi Ramarao: శ్రీహరి మరణంపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ జర్నలిస్ట్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో ఎన్నో సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన నటులలో శ్రీహరి ఒకరు అనే సంగతి తెలిసిందే.శ్రీహరి నటించిన మెజారిటీ సినిమాలు భారీ సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 Senior Journalist Imandi Ramarao Shocking Comments On Hero Srihari Details, Iman-TeluguStop.com

అయితే ప్రముఖ నటుడు శ్రీహరి మరణం ఫ్యాన్స్ ను బాధ పెట్టడంతో పాటు ఆయన మరణాన్ని అభిమానులు సైతం తట్టుకోలేకపోయారనే సంగతి తెలిసిందే.

ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు శ్రీహరి మరణం గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శ్రీహరికి జిమ్నాస్టిక్స్ లో మంచి పేరు ఉందని తెలిపారు.దాసరి గారు శ్రీహరి మంచి ఆర్టిస్ట్ అవుతాడని చెప్పేవారని పోలీస్ అనే సినిమాతో హీరోగా శ్రీహరి కెరీర్ మొదలైందని అన్నారు.

సపోర్టింగ్ పాత్రలు కూడా శ్రీహరికి మంచి పేరు తెచ్చిపెట్టాయని ఆయన వెల్లడించారు.

శ్రీ రాములయ్య సినిమాలో శ్రీహరి పాత్ర అతని కెరీర్ కు ప్లస్ అయిందని రామారావు అన్నారు.

Telugu Imandhi Ramarao, Srjournalist, Srihari, Srihari Fans, Tollywood-Movie

ఏ సినిమాలో నటించినా ఆ పాత్రే కనిపించేలా శ్రీహరి జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు.ఆపదలో ఉన్నవాళ్లను శ్రీహరి ఆదుకునేవారని రామారావు అన్నారు.శ్రీహరి చావు బలవంతపు చావు అని వినిపించిదని ఆయన పేర్కొన్నారు.శ్రీహరిలాంటి ఆర్టిస్టులను మనం చూడలేమని రామారావు చెప్పుకొచ్చారు.

Telugu Imandhi Ramarao, Srjournalist, Srihari, Srihari Fans, Tollywood-Movie

శ్రీహరి పిల్లలు సినిమాల్లో ప్రయత్నించినా సక్సెస్ కాలేదని రామారావు చెప్పుకొచ్చారు.ఆపదలో ఉన్నవాళ్లకు ఆయన సహాయం చేశారని అలా సహాయం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని రామారావు కామెంట్లు చేశారు.రామారావు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శ్రీహరి మరణించినా ఆయన జ్ఞాపకాలు మాత్రం అభిమానులను వెంటాడుతున్నాయి.సినిమాల ద్వారా ఆయన జీవించి ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube