స్టేట్ బ్యాంక్ అకౌంట్ వున్నవారికి శుభవార్త.ఎస్బీఐ ( SBI ) ఇపుడు కొత్త సర్వీసులు తీసుకు వచ్చింది.
తన ఖాతాదారులకోసం సరికొత్త యోనో యాప్( YONO ) ఒకదానిని ఆవిష్కరించింది.అవును, యోనో ఫర్ ఎవ్విరి ఇండియన్ పేరుతో సరికొత్త డిజిటల్ అప్లికేషన్ లాంచ్ చేసింది.
బ్యాంక్ తాజా నిర్ణయంతో యోనో యాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.యోనో అంటే యూ నీడ్ ఓన్లీ వన్ అనే సంగతి అందరికీ విదితమే.
ఎస్బీఐ కస్టమర్లు ఇకపై యోనో యాప్‌లో యూపీఐ సేవలు కూడా పొందొచ్చు.అంటే స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి అనేక రకాల సర్వీసులు లభించనున్నాయి.
2017లో ఎస్బీఐ యోనో యాప్‌ను తీసుకు వచ్చిన సంగతి విదితమే.అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు యోనో యాప్‌ను 6 కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.యోనో యాప్ ద్వారానే గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 78.6 లక్షల సేవింగ్స్ ఖాతాలను తెరిచారు.యోనో యాప్‌లో అప్డేట్ వెర్షన్ కారణంగా కస్టమర్లకు మరిన్ని ఫచీర్లు అందుబాటులోకి వస్తాయని గుర్తించండి.అలాగే ఎస్బీఐ ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్ ఫెసిలాటీ కూడా లాంచ్ చేసింది.
బ్యాంక్ 68వ వార్షికోత్సవం సందర్బంగా ఈ సర్వీసులు తీసుకువచ్చింది.
ఇక ఈ కొత్త క్యాష్ విత్‌డ్రాయెల్ సర్వీసులు ద్వారా ఇతర బ్యాంకులు కస్టమర్లు కూడా బెనిఫిట్ పొందొచ్చు.ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ విత్‌డ్రాయెల్( Inter Operable Cardless Withdrawl ) ద్వారా ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు కూడా యూపీఐ క్యూఆర్ క్యాష్ ఆప్షన్ ద్వారా ఎస్బీఐ ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకొనే వీలుంది.ఏటీఎం స్క్రీన్‌పై వున్న క్యూఆర్ కోడ్ ఆధారంగా అంటే దీన్ని స్కాన్ చేయడం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
యూపీఐ యాప్‌లోని స్కాన్ ఆప్షన్ ఉంటుంది.దీని ద్వారా స్కాన్ చేయాల్సి ఉంటుంది.
అంటే డెబిట్ కార్డుతో పని లేకుండా క్యాష్ వచ్చేస్తుందన్నమాట.ఎలాంటి పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు.
దీని వల్ల ఎస్బీఐ, ఇతర బ్యాంకుల కస్టమర్లకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు.