పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందడం సర్వ సాధారణం.నేటి దైనందిత జీవితంలో స్కూల్‌కి వెళ్లిన చిన్నారులు ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులకు టెన్షనే అని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా ఆడుకుంటామని బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా తల్లిదండ్రులకు కంగారే.అయితే ఇలాంటి ఆందోళనకు చెక్ పెడుతున్నాయి ఛైల్డ్ ‘జీపీఎస్ ట్రాకర్స్’.
( Child GPS Trackers ) వీటి సాయంతో ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాబు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు.స్నేహితుని బర్త్‌డే పార్టీకంటూ వెళ్లిన వాడు ఏ చోట ఉన్నాడో చిటికెలో కనుక్కోవచ్చు.
అదేవిధంగా స్కూలు నుంచి బయలుదేరిన పిల్లలు నేరుగా ఇంటికి వస్తున్నారా లేదా చెక్ చేయవచ్చు.ఇవన్నీ ఆధునిక జీపీఎస్ ట్రాకర్స్‌తో సాధ్యమవుతున్నాయి.
పిల్లలకు తెలియకుండా స్కూలు బ్యాగుకు తగిలించడం లేదా సాధారణ వాచ్‌లా అందించడం ద్వారా పిల్లలను చాలా తేలికగా ట్రాక్ చేయవచ్చు.ట్రాకర్స్‌లో మనకు మార్కెట్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి.ధర, డిజైన్, పనితీరు ఆధారంగా వాటిని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.జీపీఎస్ ట్రాకర్‌ని( GPS Tracker ) ఎంచుకునే ముందు అందులో ఉన్న ఫీచర్స్‌ని గమనించి తీసుకోవాలి.
లొకేషన్ ట్రాకింగ్‌తో పాటు టూ వే కాలింగ్, అలర్ట్స్ పొందే సదుపాయం, జియో ఫెన్స్‌డ్ జోన్స్ ఏర్పాటు, చిల్డ్రన్ ట్రాకింగ్ హిస్టరీ వంటి ఫీచర్ల గురించి కనుక్కోవాలి.జీపీఎస్ ట్రాకర్‌లన్నీ లొకేషన్‌ను ట్రాక్( Track Location ) చేసి అందిస్తాయి.
కానీ అవి కచ్చితమైన లొకేషన్‌ను అందిస్తున్నాయా లేదా అన్న విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి.
ఇపుడు మీకు తక్కువ బడ్జెట్‌లో లభించే పాపులర్ ట్రాకింగ్ డివైజ్ ‘జియోబిట్’.( Jiobit ) ఈ డివైజ్ సహాయంతో పిల్లలు ఎక్కడున్నారో క్షణాల్లో ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు.అంతేకాకుండా లైవ్ లొకేషన్ ఫీచర్‌తో పిల్లల కరెంట్ లొకేషన్‌ను కూడా గుర్తించవచ్చు.
ఒక్కసారి చార్జ్ చేస్తే పది రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.సేవ్ మోడ్‌లో పెడితే 20 రోజుల పాటు ఉంటుంది.
ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.అదేవిధంగా ‘జియోజిల్లా’ అనే ట్రాకర్ ఒకటి అందుబాటులో వుంది.
స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్టుగా ఇందులో కొన్ని ఫంక్షన్లు ఉంటాయి.ఎస్‌ఓఎస్ సింబల్‌తో ఉండే సెంట్రల్ బటన్ అత్యవసర సమయంలో సందేశం పంపడానికి సహాయపడుతుంది.
జియోజిల్లా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.ఇలాంటివి మరెన్నో మనకి లభిస్తాయి కానీ ఫీచర్లను బట్టి ఎన్నుకోవాల్సి ఉంటుంది.