గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఉద్ధరణ కోసం చేసిన కృషి ఎనలేనిదని, ఆయన చూపిన బాటలో గిరిజనులంతా ఐక్యతతో నడవాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.

ఆదివారం నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఆల్ ఇండియా బంజారా సేవా సంగ్ అధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డితో కలిసి ఆయన హాజరై సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి,బోగ్ బాండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారా జాతి ఐక్యతకు, అభ్యున్నతికి సంత్ సేవలాల్ ఎంతో కృషి చేశారన్నారు.భావితరాలకు ఆయన జీవితం ఆదర్శమని కొనియాడారు.

Sant Sevalal Is The Deity Of Tribals MLA Jaiveer Reddy, Sant Sevalal , Tribals ,

సంత్ సేవాలాల్ గిరిజన ఆరాధ్య దైవమే కాక గొప్ప ఆదర్శ పురుషుడని, అహింసా సిద్ధాంతానికి పునాదివేసి ఆచరించి చూపిన మహనీయుడని అన్నారు.సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనులకే కాదు అందరి ఆరాధ్య దైవమన్నారు.

రాష్ట్రంలో అత్యధిక శ్రీ సంత్ సేవలాల్ దేవాలయాలు ఉన్నాయని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్ణాటక లింగారెడ్డి,ఆల్ ఇండియా బంజారా సేవ్ సంగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్రనాయక్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగవాన్ నాయక్,గిరిజన నాయకులు స్కైలాబ్ నాయక్,బాబురావు నాయక్,రమావత్ దినేష్ నాయక్,రమావత్ సక్రు, రవి నాయక్,కుర్ర శంకర్ నాయక్,నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్ నాయక్,స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు,వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు,గిరిజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News