రాజమౌళి అలాంటి వ్యక్తి కాదు.. స్టార్ రైటర్ కామెంట్స్ వైరల్..?

తన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి సినిమా రిలీజ్ డేట్ వరకు కష్టపడే దర్శకులలో రాజమౌళి ఒకరు.సినిమా కోసం రాజమౌళి ఎంతో శ్రమిస్తారు కాబట్టే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు.

 Sai Madhav Burra Interesting Comments About Rajamouli, Interesting Comments, Raj-TeluguStop.com

రాజమౌళి సినిమాలపై డిస్ట్రిబ్యూటర్లు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినా పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చిన సందర్భాలు బోలెడు ఉన్నాయి.

అయితే రాజమౌళి తను కష్టపడటంతో పాటు తనతో పని చేసేవాళ్ల నుంచి బెస్ట్ ఔట్ పుట్ తెప్పించుకోవడం కోసం ఇబ్బంది పెడతాడని ఇండస్ట్రీలో గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి.

అయితే ప్రముఖ రచయితలలో ఒకరైన సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ రాజమౌళి అలాంటి వ్యక్తి కారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజమౌళి పిండేస్తారని చాలామంది భయపెట్టారని కానీ అక్కడికి వెళ్లిన తరువాత క్లారిటీ వచ్చిందని సాయిమాధవ్ బుర్రా తెలిపారు.

ఆర్ఆర్ఆర్ సినిమా అసలైన మల్టీస్టారర్ అని రామారావు నాగేశ్వరరావు, కృష్ణ శోభన్ బాబు మల్టీస్టారర్ సినిమాలు చేశారని ఆ రేంజ్ మల్టీస్టారర్ మాత్రం ఆర్ఆర్ఆర్ మాత్రమేనని సాయిమాధవ్ బుర్రా పేర్కొన్నారు.రాజమౌళితో పని చేయడం కష్టమని చాలామంది భయపెట్టారని కానీ రాజమౌళి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ సాయిమాధవ్ బుర్రా తెలిపారు.

చరణ్, ఎన్టీఆర్ లను సినిమాలో సమానంగా చూపించబోతున్నారని సాయిమాధవ్ బుర్రా పేర్కొన్నారు.

Telugu Rajamouli, Saimadhav Burra-Movie

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే తన వర్క్ అంతా పూర్తైందని.ఒక్కరోజు కూడా రాజమౌళి వల్ల తాను ఇబ్బంది పడలేదని. ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రమే తాను టెన్షన్ లేకుండా పని చేశానని సాయిమాధవ్ బుర్రా పేర్కొన్నారు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా హక్కుల కోసం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొందని నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్లు కళ్లు చెదిరే రేట్లు ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube