రైస్ మిల్లులు చిమ్ముతున్న విషం...!

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండల కేంద్రానికి సమీపంలోని రైస్ మిల్లుల నుండి వెలుబడే వ్యర్థ పదార్థాలు రోడ్డు పక్కకు వదలడంతో నిత్యం రద్దీగా ఉండే నల్గొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై దుర్గంధం వెదజల్లుతూ ప్రజలకు ఇబ్బందిగా మారింది.

ఎన్నో రోజుల నుండి ఇలా వ్యర్ధాలతో కూడిన కలుషిత నీరు రోడ్డు పక్కకు రావడంతో ఆ ప్రాంతమంతా కలుషితమై స్థానికులు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా రైస్ మిల్లర్స్, ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వ్యర్ధాలను రాకుండా చూడాలని కోరుతున్నారు.

Rice Mills Creating Pollution Nalgonda, Rice Mills ,pollution, Nalgonda, Kondama

Latest Nalgonda News