ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబు ( Chandrababu ) అరెస్టుతో అంతా అతలాకుతమైపోయింది.ఇప్పటికే జనసేన,టిడిపి పొత్తులు ఉంటాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బిజెపి పార్టీ కూడా వీళ్లతో కలిసి పనిచేస్తుందని ఈ మూడు పార్టీలు కలిసి వైయస్సార్సీపి పార్టీని గద్దించడమే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్టు ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి.

కానీ అనూహ్యంగా చంద్రబాబు అరెస్టుతో అంత తారుమారై పోయింది.ఇక దగ్గుబాటి పురేందరేశ్వరి ( Daggubati Purandareshwari ) బిజెపి పార్టీలో కీలకపదవిలో కొనసాగుతుంది.ఈ నేపథ్యంలోనే తన మరిది చంద్రబాబు నాయుడు అరెస్టు విషయాన్ని జీర్ణించుకోలేక ఆయనకి ఎల్లవేళలా సపోర్ట్ గా ఉంటూ ఆయన అరెస్టును ఖండించింది.అంతే కాదు జగన్ పార్టీపై ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే అక్రమాలను ఖండిస్తూనే ఉంది.
ఇక ఏపీలో మద్యం విషయంలో పెద్ద కుంభకోణం జరుగుతుందని,ఇది కేంద్రందృష్టికి తీసుకెళ్తారని పురేందరేశ్వరి ఇప్పటికే పలు సార్లు మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది.
ఇక ఆదివారం రోజు ఢిల్లీకి వెళ్లి అమిత్ షా ( Amith shah ) ని కలిసిన పురందరేశ్వరి కి అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అసలు విషయం ఏమిటంటే.ఢిల్లీకి వెళ్లిన పురందరేశ్వరి చంద్రబాబు విషయం అలాగే జనసేన పార్టీ తో పొత్తు విషయం మాట్లాడుతూనే జగన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మద్యం విధానంలో ఎన్ని అవకతవకలు జరిగాయి.
ఎంత పెద్ద కుంభకోణం జరుగుతుంది ఉంది అనేదానిపై ప్రతిసారి అమీత్ షా దృష్టికి తీసుకెళ్లిందట.

అయితే పురందరేశ్వరి మాటలపై చిర్రెత్తుకొచ్చిన అమిత్ షా పురందరేశ్వరి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.చంద్రబాబు అరెస్టు అయ్యారని నువ్వు వైసిపి పార్టీపై ఆగ్రహించడంలో అర్థం ఉంది.కానీ జగన్ ( Jagan ) పార్టీపై నిందలు వేయాలని చూసి సొంత పార్టీని ఇరకాటంలో పెట్టేసావ్.
ప్రతిసారి మద్యం విషయంలో సిబిఐ విచారించాలి అని మాట్లాడుతున్నావ్.ఇదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వమా.
ఐటి, సిబిఐ,ఈడి అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయనే సంగతి నీకు తెలియదా.ఏపీ మద్యం కుంభకోణం విషయంలో సిబిఐ వారితో విచారణ చేయించాలి అని స్పృహ ఉండే మాట్లాడుతున్నావా అంటూ అమిత్ షా దగ్గుబాటి పురేందరేశ్వరి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు విశ్వాసనీయ సమాచారం.
మరి అమిత్ షా వార్నింగ్ తో అయినా పురందరేశ్వరి ఇకపై మద్యం విషయంపై మాట్లాడటం మానేస్తుందా లేదా అనేది ముందు ముందు చూడాలి.