వెటర్నరీ పోస్టుల్లో మహిళలకు రిజర్వేషన్లు

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో వెటర్నరీ అండ్‌ యానిమల్‌ హస్బెండరీ శాఖలోని వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు పరుస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి మల్టీజోన్‌, కమ్యూనిటీ వారీగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచారు.

185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులతో 2022 డిసెంబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేశారు.వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

Latest Nalgonda News