2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) ఇప్పటికే తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలలో వున్న కొందరు ప్రముఖులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.
ఇంకొందరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా వున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( Florida Governor Ron DeSantis ) కూడా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
వీరితో పాటు మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్, మాజీ ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హేలీ, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఇండో అమెరికన్ బిలియనీర్ వివేక్ రామస్వామిలు ఆ పార్టీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా చరిత్రలో మాయని మచ్చగా మారిన కాపిటల్ హిల్స్ అల్లర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ).అయోవాలోని డెస్‌మోయిన్స్‌లో జరిగిన ఓ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సిన్, లాక్డౌన్ వంటి అంశాలు ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయన్నారు.
దేశంలోని ప్రజలను మాట్లాడలేరు అన్నప్పుడు.కేకలు వేయలేరు అన్నప్పుడు వారు వస్తువులను కూల్చివేస్తారని రామస్వామి వ్యాఖ్యానించారు.
కాగా.అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం 2021 జనవరి 6న యూఎస్ కాంగ్రెస్( US Congress ) .క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.
భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.
వారిని శాంతింపజేసేందుకు భద్రతా దళాలు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది.గతంలో ఏ అధ్యక్షుడికి రానంత అప్రతిష్టను ట్రంప్ మూట కట్టుకోవాల్సి వచ్చింది.
37 ఏళ్ల రామస్వామి బిలియనీర్.ప్రస్తుతానికి నిజనిర్ధారణ మిషన్లను ప్రారంభించి, అయోవాలో పలు ఈవెంట్లలోనూ అతను పాల్గొంటున్నాడు.భారతీయ వలసదారులకు జన్మించారు వివేక్ రామస్వామి.ఈయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజనీర్.తల్లి డాక్టర్.ఈ దంపతులకు రామస్వామి సిన్సినాటిలో( Ramaswami in Cincinnati ) జన్మించారు.
హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలలో ఆయన చదువుకున్నారు.ఈయన సంపద విలువ 500 మిలియన్ అమెరికన్ డాలర్లు.
అమెరికాలో విజయవంతమైన బయోటెక్ వ్యవస్థాపకుడిగా వివేక్ రామస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన కంపెనీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఐదు ఔషధాలు సహా పలు మందులను అభివృద్ధి చేసింది.