శ్రీపతి ల్యాబ్ లో పేలిన రియాక్టర్

నల్లగొండ జిల్లా:చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద గల శ్రీపతి ల్యాబ్ ( Shripati Lab)లో అగ్ని ప్రమాదం సంభవించింది.

ల్యాబ్ లో రియాక్టర్ పేలి చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది.

ప్రమాదం నుంచి కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.ఘటనపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్( SP Sarath Chandra Pawar ) ఆదేశాలతో సకాలంలో స్పందించిన చిట్యాల పోలిసులు హుటాహుటిన కంపెనీకి చేరుకుని ప్రమాద తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు.

Reactor Exploded In Sripati Lab, Sripati Lab, Reactor Exploded ,Nalgonda Distr

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసుల సహకారంతో మంటలు అదుపులోకి తేవడంతో కంపెనీ నిర్వాహకులు,స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా మారాలా.. అయితే మీరీ న్యాచురల్ ఫేస్ వాష్ వాడాల్సిందే!
Advertisement

Latest Nalgonda News