రాజోలు జనసేనదే: పొలిటికల్ క్రిటిక్ సర్వే !

ఎన్నికలకు దగ్గర వస్తున్న కొద్దీ రాష్ట్రం లో సర్వేల హడావుడి పెరిగిపోతుంది.రాజకీయ రంగంలో కాస్త పేరు ఉన్న మీడియా సంస్థలు శాంపిల్ సర్వేలు చేస్తూ ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Rajolu Winner Janasena Political Critic Survey! , Political Critic Survey, Jana-TeluguStop.com

సర్వే రిపోర్ట్ లు రిలీజ్ చేస్తూ తమ టిఆర్పి రేటింగ్ లను వ్యూస్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.దానిలో భాగంగానే ప్రముఖ మీడియా సంస్థల నుంచి చిన్నచిన్న ఇండివిడ్యువల్ వెబ్సైట్లు, యూట్యూబ్ చానల్స్ కూడా ఎక్కడికక్కడ ఎన్నికల ఫీవర్ ను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Telugu Andhra Pradesh, Janasena, Pawan Kalyan, Critic, Rajolu, Ys Jagan-Telugu P

కొన్ని అధికార పక్షానికి అనుకూలంగా వకాల్తా పుచ్చుకుంటుంటే మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు తరపున నిలుస్తున్నాయి .దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్వేలు చేస్తున్న పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ( Andhra Pradesh )ఎన్నికలలో సర్వే రిపోర్ట్ లను ప్రకటిస్తుంది .దాంట్లో బాగం గానే తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎన్నికల పలితాన్ని ప్రకటించింది.32.99 శాతం ఓటింగ్ అధికార పార్టీ కి వస్తుందని తెలుగుదేశానికి 27.81 శాతం, ఎన్డీఏ కూటమి(జనసేన + బిజేపి) 36.85 శాతం ఓటు బ్యాంకుతో ఈ సీటును గెలుచుకుంటుందని పొలిటికల్ క్రిటిక్ సర్వే అంచనా వేసింది.

Telugu Andhra Pradesh, Janasena, Pawan Kalyan, Critic, Rajolu, Ys Jagan-Telugu P

వైయస్ జగన్ ( YS Jagan )ఉధృత వేవ్ లో కూడా జనసేన పార్టీ ఈ ఒక్క సీటును గెలుచుకోగలిగింది.తదనంతర పరిణామాలతో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించినప్పటికీ జనసేన ( Janasena )కేడర్ మాత్రం పార్టీకి కట్టుబడి ఉన్నట్లుగా అనేక సంఘటన రుజువు చేశాయి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అక్కడ జనసేన బలపరిచిన అభ్యర్థి సర్పంచిగా ఎన్నికయ్యాడు .అంతేకాకుండా జనసేన వారాహి యాత్రకు కూడా అక్కడ అనూహ్య స్పందన లభించింది.దాంతో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ పక్కాగా గెలుచుకునే సీటుగా రాజోలు డిక్లేర్ అయినట్టుగా తెలుస్తుంది.జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సామాజిక వర్గ ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉండటంతో పాటు దళిత ఓట్లు అధికంగా ఉన్న ఈ స్థానంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం, ఇది జనసేనకు డ్యామ్ షూర్ సీటుగా మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరి అధికార పార్టీ ఈ నియోజకవర్గంలో ఏవ్యూహం తో ముందుకు వెళ్తుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube