భారతీయ రైల్వేలో తొలి సారిగా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణికులకు మాత్రమే టాయిలెట్ సౌకర్యం కల్పించారు.ఆ తర్వాత క్రమంగా అన్ని వర్గాల ప్రయాణికుల కోసం రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేశారు.
కొంత కాలం క్రితం రైళ్లను నడుపుతున్న లోకో పైలట్‌లు అంటే రైలు డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్య పోతారు.రైలులో ప్రయాణించే ప్రయాణికుల కోసం 1909 సంవత్సరం నుంచి టాయిలెట్ సౌకర్యం ప్రారంభించగా, లోకో పైలట్‌లకు ఈ సౌకర్యం 2016 సంవత్సరంలో ప్రారంభమైంది.
అంటే, 1853 నుండి 2016 వరకు, రైళ్లను నడిపే లోకో పైలట్‌లు మల మూత్ర విసర్జనకు రైలు ఆగే వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
అంతే కాకుండా రైలు డ్రైవర్లు మలమూత్ర విసర్జన చేయాల్సివస్తే.
సమీపంలోని రైల్వే స్టేషన్‌కు మెసేజ్‌లు పంపి.సదరు స్టేషన్‌కు రాగానే టాయిలెట్‌కు పరుగులు తీసేవారు.2016 సంవత్సరానికి ముందు డ్రైవర్ల మల విసర్జన సమస్య కారణంగా చాలా రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించేవి.దీనిని గుర్తించిన రైలు డ్రైవర్లు తమ సామర్థ్యం మేరకు మలవిసర్జనను నియంత్రించుకునేవారు.దీని కారణంగా వారు అనేక రకాల శారీరక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.2016 సంవత్సరం వరకు, భారతీయ రైల్వేలోని లోకో పైలట్లు ఇంజిన్లలో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.కానీ భద్రతా కారణాల దృష్ట్యా భారతీయ రైల్వే ఇంజన్లలో టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించలేక పోయింది.భద్రతా కారణాలతో పాటు, రైలు ఇంజిన్‌లో టాయిలెట్‌ను ఏర్పాటు చేయడానికి తగినంత స్థలం లేదు.
అయితే, సుదీర్ఘ చర్చలు మరియు పరిశోధనల తర్వాత, రైల్వే 2016 సంవత్సరం నుండి రైలు ఇంజిన్లలో టాయిలెట్లను తయారు చేసే పనిని ప్రారంభించింది. ట్రాక్‌పై మురికి పడకుండా భారతీయ రైల్వే ఇంజిన్‌లలో బయో టాయిలెట్‌లను ఏర్పాటు చేశారు.
అంతే కాకుండా అతి తక్కువ నీరు వినియోగించే విధంగా ఈ టాయిలెట్లను రూపొందించారు.