ఇల్లే లేదన్నాడు అప్పుడే బెంజ్‌ కారు కొన్నాడు ఎలా?

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌లు ఇప్పటి వరకు మూడు పూర్తి అయ్యాయి.ఈ మూడు సీజన్‌లలో ముగ్గురు విజేతలుగా నిలిచారు.

 Rahul Purchase Own House And Benz Car-TeluguStop.com

చాలా మంది కంటెస్టెంట్స్‌ పాల్గొన్నారు.విన్నర్స్‌ మరియు కంటెస్టెంట్స్‌లో ఏ ఒక్కరు కూడా బిగ్‌బాస్‌ ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకోలేక పోయారు.

కొందరు అయితే తమ క్రేజ్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చింది.కెరీర్‌కు నష్టం కూడా అయ్యింది.

కాని ఒక్క రాహుల్‌ సిప్లిగంజ్‌కు మాత్రం అనూహ్యంగా బిగ్‌ బాస్‌ ట్రోఫీ లక్‌ను తెచ్చి పెట్టింది.ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ కాలం గడిపిన రాహుల్‌ కుటుంబ సభ్యులు బిగ్‌బాస్‌ విన్‌ అయిన తర్వాత సొంత ఇంటికి మారాడు.

Telugu Bigboss, Rahul, Rahul Big Boss, Rahul Friend, Rahulcinima, Rahul Benz Car

మొదటి నుండి ఒక ఇల్లు కొనుగోలు చేయాలని భావించిన రాహుల్‌ బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుగోలు చేశాడు.నిన్న మొన్నటి వరకు షిప్ట్‌ కారులో తిరిగిన రాహుల్‌ ఇప్పుడు ఏకంగా బెంజ్‌ కారు కొనుగోలు చేశాడు.దాదాపు 50 లక్షల రూపాయలతో బెంజ్‌ కారును రాహుల్‌ కొనుగోలు చేసినట్లుగా ఆయన స్నేహితుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.బిగ్‌బాస్‌ నుండి బయటకు రాగానే రాహుల్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి.

అందుకే ఒక్కసారిగా రాహుల్‌ పారితోషికం భారీగా పెరిగింది.

Telugu Bigboss, Rahul, Rahul Big Boss, Rahul Friend, Rahulcinima, Rahul Benz Car

ఈ ఆరు నెలల్లో రాహుల్‌ ఏకంగా కోటిన్నర వరకు సంపాదించాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.డబ్బు సంపాదించడంతో సొంత డబ్బుతో ఇప్పుడు కారు కొనుగోలు చేశాడు.గతంలో తండ్రి కారు కొనిస్తే ఇప్పుడు తన సొంత డబ్బుతో బెంజ్‌ కారును కొనుగోలు చేసిన రాహుల్‌కు హార్థిక శుభాకాంక్షలు అంటూ ఆయన స్నేహితులు మరియు అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube