డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగు పెట్టి 20 యేళ్లు పూర్తి చేసుకున్నాడు.మొదటి సినిమానే పవన్ కళ్యాణ్‌తో చేయడం వల్ల పూరి కెరీర్ ఆరంభంలోనే పీక్స్‌కు వెళ్లింది.
బద్రి చిత్రం తర్వాత పూరి కొంత కాలం పాటు వెనక్కు తిరిగి చూసుకోలేదు.చాలా స్పీడ్‌గా సినిమాలు తెరకెక్కించే వాడు.
పోకిరి తర్వాత ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు అంతా కూడా క్యూ కట్టారు.
ఆ సమయంలో పారితోషికం విషయంలో టాప్ లో ఈ దర్శకుడు ఉండేవాడు.
అయితే మద్యలో కొన్ని ఆర్థికపరమైన సమస్యలు తలెత్తినట్లుగా పూరి చెప్పుకొచ్చాడు.తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ.
తాను ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించలేదు.డబ్బుపై, భూములపై తాను ఎప్పుడు మోజు చూపలేదు.
అందుకే అప్పట్లో వంద కోట్ల వరకు నష్టపోయాను.నమ్మిన వారే నన్ను వంద కోట్ల వరకు మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం మళ్లీ తాను పుంజుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
వంద కోట్లకు పూరిని ఎవరు మోసం చేసి ఉంటారు.
అయినా దర్శకుడిగా పూరి వంద కోట్ల రూపాయలను ఎలా సంపాదించాడంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.నాలుగు అయిదు సంవత్సరాల ముందు వరకు కూడా దర్శకుడికి పారితోషికం మూడు నాలుగు కోట్ల లోపే ఉండేది.
పూరి ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో కోటి నుండి రెండు కోట్లు చాలా గొప్ప విషయం.ఆ మొత్తంతోనే వంద కోట్లను పూరి ఎలా సంపాదించాడు.
పబ్లిసిటీ కోసమే ఇలా ప్రచారం చేస్తున్నాడా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.