టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పూరి జగన్నాథ్(Puri Jagannadh) ఒకరు.ఈయన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరు కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న వారే.ఇలా ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారని కూడా చెప్పాలి.
ఇకపోతే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ( Raviteja ) హీరోగా నటించిన ఇడియట్ ( Idiot Movie ) సినిమా ఎలాంటి సక్సెస్ అయిందో మనకు తెలుసు.ఈ సినిమాలో రవితేజ మాస్ క్యారెక్టర్ లో ఎంతో అద్భుతంగా నటించారు.
ఈ సినిమాలో రవితేజ రక్షిత మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.కమిషనర్ కూతుర్లకు మొగుళ్ళు రారా, ప్రేమ ఈరోజు కాకపోతే మరొక ఏడాదికైనా పుడుతుంది అంటూ కొన్ని డైలాగ్స్ అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చెప్పాలి.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పూరి జగన్నాథ్ భార్య లావణ్య (Lavanya) తమ ప్రేమ గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు.
పూరి గారు దర్శకత్వం వహించిన ఇడియట్ సినిమా మా లవ్ స్టోరీ ఆధారంగానే తీసారంటూ ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు.మా లవ్ స్టోరీ (Love Story) నే ఈ సినిమా కథగా రాసి ఇడియట్ సినిమా చేశారు అంటూ లావణ్య ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.అదేవిధంగా పూరి గారితో తన పరిచయం ఎలా జరిగింది? తనని మొదటి ఎక్కడ చూసారు అనే విషయాలన్నింటిని కూడా లావణ్య తెలియజేశారు.రామంతపూర్ లో ఒక సీరియల్ షూటింగ్( Serial Shooting ) కోసం పూరి జగన్నాథ్ తన టీం అందరూ కలిసి అక్కడికి వచ్చారు అప్పట్లో సినిమాలు షూటింగ్ అంటే అందరికీ ఎక్సైజ్మెంట్ ఉండేది అందుకే తాను కూడా ఆ షూటింగ్ చూసేకి వెళ్లానని తెలిపారు.
ఈ విధంగా ఆ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ నన్ను చూసారని చూడగానే ఆయన తన అసిస్టెంట్ తో నాకు విసిటింగ్ కార్డు ఇచ్చి తనతో మాట్లాడాలని చెప్పారు అయితే అప్పుడు నాకు భయం వేసి వెళ్ళిపోయాను అని తిరిగి మరో రోజు కూడా అలాగే వచ్చారని తెలిపారు.నేనేమీ రిప్లై ఇవ్వక పోయేసరికి ఆ సీరియల్ లో నటించిన హీరోయిన్ తో కలిసి ఒక వారం రోజుల తర్వాత పూరి జగన్నాథ్ , తన అసిస్టెంట్ ను మా ఇంటికి పంపి సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట( Marriage ) ఒకసారి మీరు మాట్లాడండి లేకపోతే సారే వారి వాళ్ళని తీసుకొని మీ దగ్గరకు వస్తారట అంటూ ఆమె తెలిపింది.నాకు భయం వేసి తనకు ఫోన్ చేసి ఒక చోట కలవాలని చెప్పాను.
అక్కడ కూడా తాను ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడతానని చెప్పాను కానీ ఐదు నిమిషాలు అనుకున్న మా సమయం దాదాపు గంటకు పైన ఇద్దరు కలిసి మాట్లాడుకున్నామని ఆ క్షణమే ఆయన నాకు నచ్చేసి అలా మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది( Love ) అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ తో తన ప్రేమ విషయాన్ని లావణ్య బయటపెట్టారు.ఇలా వారిద్దరి మధ్య నడిచినటువంటి ప్రేమ కథ ఆధారంగానే ఇడియట్ సినిమా చేశారు అంటూ లావణ్య ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.