సినిమా షుటింగులకు పంజాబ్ గ్రీన్ సిగ్నల్..!

ఈ రంగం ఆ రంగం అని కాకుండా కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై భారీగానే చూపుతోంది.ఈ ప్రభావం సిని రంగంపై కాస్తా ఎక్కువగానే పడింది అని చెప్పవచ్చు.2020 సంవత్సరం ప్రారంభమైన మూడో నెలలోనే కరోనా లాక్‌డౌన్ కారణంగా సిని రంగం మూగబోయింది.లాక్‌డౌన్ సడలింపు తర్వాత కూడా ప్రభుత్వాలు సిని షూటింగులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.

 Punjab Green Signal For Film Shootings ..! Political, Movie,movie Shootings, Pun-TeluguStop.com

దీంతో ఈ ఏడాది సినిమా షుటింగులన్ని వాయిదా పడ్డాయి.అయితే, తాజాగా పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సిని ప్రేక్షకులకు కాస్తా ఊరటనిస్తోంది.

మొదటిసారి పంజాబ్ ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు అనుమతించింది.

కరోనా నియమానిబంధనలు పాటిస్తూ షూటింగులు నిర్వహించుకోవచ్చని తెలిపింది పంజాబ్ ప్రభుత్వం.

సినిమా షూలిటింగ్‌ల వద్ద కేవలం 50 మందికి మించి ఊండకూడదని, తప్పనిసరిగా భౌతికదూరం పాటిస్తూ మాస్కులు,శానిటైజర్లు వినియోగించాలని సూచించింది.అలాగే బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న నిబందనలే షూటింగ్ ప్రాంతాల్లోనూ వర్తిసాయి.

అందరూ తప్పకుండా కరోనా నిబందనలను విధిగా పాటించాలని తెలిపింది.

చిత్ర నిర్మాణ సంస్థలు తమ సినిమాల్ని ఎక్కడెక్కడ ఏఏ సన్నివేశాలు చిత్రీకరించాలో ముందుగానే సన్నాహాలు చేసుకున్నాయి.

కరోనా కారణంగా నిర్మాత దర్శకులు షూటింగులు వాయిదా వేసుకుని కుటుంబసభ్యులతో గడుపుతున్నారు.అయితే, తాజా పంజాబ్ నిర్ణయంతో తగు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులకు సన్నద్ధమవుతున్నారు.

తాజా పంజాబ్ నిర్ణయంతో ఎంతమంది నటీనటులు ఏకీభవించి తమ సినిమా షుటింగులు తిరిగి ప్రారంభిస్తా? లేదా కరోనాతో రిస్క్ ఎందుకని ఇంట్లోనే ఉంటారా? వేచి చూడాలి.అయితే, ఈ ప్రభావం మిగతా రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఎక్కువగానే కనబడతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube