ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేశ్ కు నిరసన సెగ

ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేశ్ కు అసమ్మతి సెగ తగిలింది.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు మంత్రి ఆదిమూలపు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 Protest Against Minister Adimulapu Suresh In Ongole-TeluguStop.com

ఈ క్రమంలో మంత్రి ఆదిమూలపు వైఖరిపై కొండెపికి చెందిన నేత రవిరెడ్డి వర్గీయులు మండిపడ్డారు.కార్యక్రమానికి ముందుగా వచ్చిన తమను మంత్రి కలవలేదని, కానీ అశోక్ రెడ్డి వర్గానికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు.

దీంతో మంత్రి వైఖరిపై తీవ్ర అసంతృప్తికి గురైన రవిరెడ్డి వర్గం నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.అయితే ఒక్క పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయని మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు.

తాము స్టేజీపైకి రాగానే మంత్రి ఆదిమూలపు కిందకు దిగిపోయారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube