టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇటీవలే ప్రభాస్ ఆది పురుష్( Adi Purush ) సినిమాతో ప్రేక్షకులను పులకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.
రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి.
డైలాగ్స్, పాత్రలతో పాటు సీత ఇండియాలో జన్మించినట్లు చూపించడం వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి.తొలి మూడు రోజులు వసూళ్లు సాధించినా ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి.ఈ చిత్రం కోసం దాదాపుగా రూ.600 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.దీంతో అభిమానులు అంచనాలు అన్నీ కూడా ప్రభాస్ తదుపరి సినిమా సలార్, ప్రాజెక్టు కె ( Salar, Project K )సినిమాలపై పెట్టుకున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇందులో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి పాన్ ఇండియా సెలబ్రిటీలు నటిస్తున్నారు.అంతేకాకుండా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల చర్చలు మొదలయ్యాయి.
ఈ చిత్రంలోని నటీనటులు రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది.భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉండనుండడంతో ఈ మూవీ బడ్జెట్ రూ.600 కోట్లకు పైగానే ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ అదే గనుక నిజమైతే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రాజెక్ట్-కె నిలవనుంది.
ఈ విషయంలో ఆదిపురుష్ ని మించి ఈ సినిమా ఉండనుంది.