Project K , Adi Purush: ఆ విషయంలో ప్రాజెక్ట్ కే ఆదిపురుష్ ను దాటనుందా.. సక్సెస్ ను సొంతం చేసుకుంటాడా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఇటీవలే ప్రభాస్ ఆది పురుష్( Adi Purush ) సినిమాతో ప్రేక్షకులను పులకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.

రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. """/" / డైలాగ్స్, పాత్రలతో పాటు సీత ఇండియాలో జన్మించినట్లు చూపించడం వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి.

తొలి మూడు రోజులు వసూళ్లు సాధించినా ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి.ఈ చిత్రం కోసం దాదాపుగా రూ.

600 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

దీంతో అభిమానులు అంచనాలు అన్నీ కూడా ప్రభాస్ తదుపరి సినిమా సలార్, ప్రాజెక్టు కె ( Salar, Project K )సినిమాలపై పెట్టుకున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

"""/" / ఇందులో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి పాన్ ఇండియా సెలబ్రిటీలు నటిస్తున్నారు.

అంతేకాకుండా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల చర్చలు మొదలయ్యాయి.ఈ చిత్రంలోని నటీనటులు రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది.

భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌ ఉండనుండడంతో ఈ మూవీ బడ్జెట్‌ రూ.600 కోట్లకు పైగానే ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ అదే గనుక నిజమైతే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ప్రాజెక్ట్-కె నిలవనుంది.

ఈ విషయంలో ఆదిపురుష్ ని మించి ఈ సినిమా ఉండనుంది.