ప్రైవేట్ బస్సు బోల్తా...స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి- నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తాపడింది.ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

జగిత్యాల నుంచి ప్రయాణికులతో దర్శికి బయలుదేరిన బస్సు ఆదివారం తెల్ల వారుజామున వేములపల్లి వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తాపడిందని తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్న ట్లు,వారికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.బస్సు రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌ కొంతసేపు స్తంభించింది.

పోలీసులు జేసీబీ,క్రేన్‌ సహాయంతో బస్సును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Advertisement

Latest Nalgonda News