టాలీవుడ్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ విజువల్ అండ్ గ్రాఫిక్స్ కలిగిన సినిమాల్లో హనుమాన్ ( HanuMan ) ఒకటి.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతున్న పలు భారీ సినిమాల్లో ”హనుమాన్” కూడా ఉంది.
దీంతో ఈ సినిమాపై సర్వత్రా ఉత్కంఠగా ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా ( Teja Sajja ) అమృత అయ్యర్ ( Amritha Aiyer ) హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.టీజర్ రిలీజ్ తో అంచనాలు భారీగా పెంచుకున్న ఈ సినిమా పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.
ప్రస్తుతం మేకర్స్ ఇదే ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నారు. టీజర్ రిలీజ్( HanuMan Teaser ) తో అంచనాలు భారీగా పెంచుకున్న ఈ సినిమా నుండి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.ఈ సినిమా సంక్రాంతికి తగ్గ ఒక ప్రాపర్ మూవీ అని అలాగే ఇందులో మద్యంకు సంబంధించి కానీ పొగాకుకు సంబంధించిన సన్నివేశాలు లేవని.ఇదొక క్లీన్ చిత్రం అంటూ ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా నుండి నుండి ప్రతీ మంగళవారం ఒక అప్డేట్ ఇస్తామని మేకర్స్ తెలిపారు.హునుమంతుడికి ఎంతో ప్రీతీ కరమైన మంగళవారం రోజున అప్డేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా నిన్న మంగళవారం ఈ అప్డేట్ ఇచ్చి ఈ సినిమాపై హైప్ పెంచారు. ప్రశాంత్ వర్మ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా ఈ మూవీ కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.ఇక 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.