తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు తన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న నటుడు ప్రకాష్ రాజ్( Prakash Raj )… ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంచలన దర్శకుడి గా గుర్తింపు పొందిన రాంగోపాల్ వర్మ శివ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక అప్పటినుంచి వర్మ దగ్గర వర్క్ చేయడానికి చాలా మంది ఉత్సాహాన్ని చూపించారు.
ఇక ఇప్పుడున్న దర్శకులు చాలామంది ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వాళ్లే కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ఒక సినిమాకి గాను ఒక క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ ని తీసుకుందామని వర్మ డైరెక్షన్ టీం లో ఉన్న కొందరు అంటే, దానికి కౌంటర్ గా వర్మ ప్రకాష్ రాజ్ కి ఈ టైప్ క్యారెక్టర్ లో యాక్టింగ్ చేయడం రాదు.ఆయన మంచి నటుడే కానీ ఆయన చేసే యాక్టింగ్ మన సినిమా క్యారెక్టర్ కి సెట్ అవ్వదు.ఆయన మంచి నటుడే అయినప్పటికీ మన క్యారెక్టర్ కి సెట్ అవ్వనప్పుడు ఎంత మంచి నటుడి నైన రిజెక్ట్ చేయక తప్పదు అంటూ వర్మ( Ram gopal varma ) తన టీమ్ అందరికీ క్లారిటీ ఇచ్చినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.
అయితే ఏ సినిమా కోసం వర్మ ప్రకాష్ రాజ్ ని రిజెక్ట్ చేశాడు అంటే, జగపతిబాబు లీడ్ రోల్ లో వచ్చిన రక్ష సినిమా( Raksha ) కోసం మొదట జగపతిబాబు క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ ను తీసుకుందామని అనుకున్నారు.కానీ వర్మ మాత్రం ఆ క్యారెక్టర్ కి జగపతి బాబు మాత్రమే సెట్ అవుతాడు అని చెప్పడంతో ప్రకాష్ రాజ్ ను పక్కన పెట్టి జగపతి బాబు ను తీసుకున్నట్టుగా తెలుస్తుంది…
.