బీఆర్ఎస్ లీడర్ల మధ్య పోస్టర్ల పోరు...!

నల్గొండ జిల్లా:నల్లగొండఅసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్< BRS party ) సీటింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి,టికెట్ ఆశిస్తున్న నాయకులు చాడా కిషన్ రెడ్డి,పిల్లి రామరాజు( Pilli Ramaraju Yadav )లకు మధ్య రగులుతున్న గ్రూప్ వార్ తారాస్థాయికి చేరుకుంది.

తరచూ వీరి మధ్య ఫ్లెక్సీ వార్,వాల్ రైటింగ్,వాల్ పోస్టర్ల వార్ రూపంలో రచ్చకెక్కుతూ పార్టీ పరువును బజారుకీడుస్తుందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

తాజాగా శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యర్శి చాడా కిషన్ రెడ్డి( Chada kishan Reddy ) నల్గొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచార పోస్టర్లను వేయించారు.చాడా పోస్టర్లపై ఓ ప్రైవేట్ క్లినిక్ కు సంబంధించిన పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు.

Poster Fight Between BRS Leaders...!, BRS Leaders , Chada Kishan Reddy , Pilli

చాడ పోస్టర్లు ఉన్న జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ గ్రామాల్లోనూ అన్ని చోట్ల చాడ పోస్టర్లపై ప్రైవేట్ క్లినిక్ పోస్టర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.పనిగట్టుకొని కొందరు నేతలు ఈ చర్యలకు పాల్పుతున్నారని చాడా వర్గం ఆరోపిస్తోంది.

మూసికి పూడిక ముప్పు
Advertisement

Latest Nalgonda News