స్మార్ట్ ఫోన్లో కూడా అవకాశం

ఈకేవైసీ నమోదను స్మార్ట్ఫోన్లలో కూడా చేసుకోవచ్చు .కామన్ సర్వీసెసెంటర్లు,బ్యాంకులు,మీ సేవా,ఈ సేవా,ఆన్లైన్ సేవా కేంద్రాల్లోనూ నమోదు చేసుకునే అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు కేంద్ర ప్రభుత్వం సూచించిన లింకును ఓపెన్ చేసి ఆధార్ను లింకై అనుసంధానం చేసుకోవచ్చు.ఆధార్తో ఉన్న ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది.

Possibility Even On A Smart Phone-స్మార్ట్ ఫోన్లో �

దాన్ని మళ్లీ ఎంటర్ చేసి , గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేయాలి.సెల్ ఫోన్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.ఈ-కేవైసీ అంతంతే ముందుకురాని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు.34,159 మందికిగాను 12,600 మంది ఆధార్ అనుసంధానం.31 తో ముగియనున్న గడువు.నల్గొండ జిల్లా:సన్న చిన్నకారు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎంకేఎస్వై) పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.ఈ పథకం కింద రూ.2 వేల చొప్పున ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమచేస్తూ వస్తున్నారు పథకం నిబంధనల్లో కేంద్రం ఇటీవల మార్పులు చేసింది.ఇకపై కిసాన్ సమ్మాన్ నిధి సాయం పొందాలంటే ఆధార్ అనుసంధానం (ఈకేవైసీ) తప్పనిసరి చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది .ఈనెల 31 లోగా ఈకేవైసీ చేసుకోకుంటే పెట్టుబడి సాయం పొందే అవకాశం లేకుండా పోతుంది.నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆధార్ అనుసంధాన కార్యక్రమం నెమ్మదిగా జరుగుతూ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.సమ్మాన్ నిధి లబ్దిదారులు 34.159 మంది ఉండగా ఇప్పటి వరకు ఆధార్ ఈకేవైసీ అనుసంధానం చేసుకున్న రైతులు 12,600 మంది మాత్రమే ఉన్నారు.త్వరగా అనుసంధానం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

చాలా మంది రైతులకు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ లేకపోవడంతో అనుసంధానం చేసే సమయంలో ఓటీపీ రాక సమస్యలు తలెత్తుతున్నాయి.మీ సేవా కేంద్రాల్లో ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని,పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఆధార్ ను అనుసంధానం చేసుకుంటున్నారు.

Advertisement

కాగా 2019 ఫిబ్రవరి వరకు పట్టాదారు పాసుపుస్త కాలున్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.ఆ తరువాత భూములు కొనుగోలు చేసిన రైతులకు పథకం వర్తించదు.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లింపుదారులను అనర్హులుగా పరిగణించడం జరుగుతుంది.ఆధార్ అనుసంధానం తప్పనిసరి.

ఇప్పటి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా కేంద్రం సూచించిన విధంగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలి.ప్రస్తుతం కొందరు రైతులే పూర్తి చేయించుకున్నారు.

ఈ విషయంపై అన్ని మండలాల్లో అవగాహన కల్పిస్తున్నాం.ఈనెల 31 తో గడువు ముగుస్తున్న నేపద్యంలో అనుసంధానం చేసు కోనివారంతా త్వరగా చేసుకోవాలి.

వెంకట రవీందర్,ఏడీఏ,హాలియా.

Advertisement

Latest Nalgonda News