అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఏది బెటరో తెలుసుకోండి!

అపార్ట్మెంట్( Apartment ) కల్చర్ ఇపుడు చిన్న పట్టణాలకు పాకేసింది.సొంతిల్లు కొనుక్కోవాలనుకునే సగటు మధ్య తరగతి వారికి బడ్జెట్‌లో ఇల్లు దొరకడంతో అపార్ట్మెంట్ వైపు మొగ్గుచూపుతున్నారు.

 Planning To Buy A Flat In An Apartment Find Out Which One Is Better , Planning-TeluguStop.com

మరోవైపు అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యునిటీల్లో ఉండటం, సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండటంతో చాలా మంది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలోనే చాలా వరకు అపార్ట్మెంట్ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు( Construction companies ) ఏకంగా 50 అంతస్తుల వరకు నిర్మిస్తున్నాయి.

అయితే మొదటిసారి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనాలనుకొనే వారికి అనేక సందేహాలు ఉంటాయి.అపార్ట్మెంట్ లో ఏ ఫ్లోర్ సౌలభ్యంగా వుంటుంది అనే దానిపైన అయోమయం నెలకొంటుంది.

Telugu Find, Buy Flat-Latest News - Telugu

అలాంటి సందేహాలు ఇపుడు ఇక్కడ నివృత్తి చేసుకుందాము.ప్రధానంగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్‌ను కొనేవారు ముందుగా ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం, పరిసరాలు, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు వంటివి ఖచ్చితంగా పరిశీలించాలని రియాలైట్ నిపుణులు చెబుతున్నారు.ఇంటి బడ్జెట్‌తో పాటు భవిష్యత్తులో వృద్ధికి సంబంధించిన అవకాశాలను బేరీజు వేసుకోవాలి.ఇక ఏ అంతస్తులో ఫ్లాట్ కొనాలన్నది చాలా మందిని మెదిలే ప్రశ్న.ఐదు నుంచి పది అంతస్తుల్లోని అపార్ట్మెంట్ లో ఏ ఫ్లోర్‌లో తీసుకోవాలన్నది తేల్చుకోవడం కష్టం అవుతుంది.ఎందుకంటే ఇప్పుడు 50 అంతస్తులకు పైనే హైరైజ్ అపార్ట్మెంట్స్ వెలుస్తున్నాయి కాబట్టి.

ఫ్లోర్స్ ఎంపిక సందర్భంగా ప్రతి దాంట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు వుంటాయి.

Telugu Find, Buy Flat-Latest News - Telugu

కాంక్రీట్ జంగిల్‌లా కాకుండా అపార్ట్మెంట్ చుట్టూ తగిన ఖాళీ స్థలం ఉండి, చుట్టూ పచ్చదనం ఉంటే క్రింది అంతస్తుల్లో కొనుగోలు చేయడం ఉత్తమం.ముఖ్యంగా క్రింది అంతస్తులో గాలి, వెలుతురు సమృద్ధిగా వస్తుందా లేదా అన్నది కూడా ఇక్కడ పరిశీలించుకోవాలి.ఇంట్లో పెద్దవాళ్లు ఉండి, వారు ప్రతిసారి లిఫ్ట్( Lift ) ఎక్కడం ఇబ్బంది అనుకుంటే క్రింది ఫ్లోర్స్ మేలంటున్నారు నిపుణులు.

అయితే ఇక్కడ కొన్ని మైనస్ పాయింట్స్ వుంటాయి.క్రింది అంతస్తుల్లో ఉంటే అపార్ట్మెంట్ కు వచ్చిపోయే వారి సందడితో కొంత ఇబ్బంది వుండొచ్చు.అలాగే క్రింది ఫ్లోర్స్‌ లో భద్రతాపరంగా కూడా ఇబ్బంది ఉండవచ్చని రియల్ రంగ నిపుణులు అంటున్నారు.అయితే తరచూ ఇల్లు మారే వారికి కింది ఫ్లోర్ బెటర్ గా వుంటుంది.

కాస్త థ్రిల్ కోరుకునే వారు పైఅంతస్తుల్లో కొనుక్కోవడం మేలు.ప్రధానంగా పైఫ్లోర్స్‌ లో ఉంటే గాలి వెలుతురు కావాల్సినంత వస్తుంది.

బాల్కనీల్లోంచి చూస్తే చుట్టూ పరిసరాలన్నీ కనిపిస్తాయి.ఇంకా పై అంతస్తుల్లోకి దోమలు కూడా పెద్దగా రావు.

అయితే పై అంతస్తుల్లోంచి ప్రతిసారి క్రిందకు రావాలంటే లిఫ్టుల్లోనే టైం గడిచిపోతుంది.అంతే కాకుండా అత్యవసర సమయాల్లో క్రిందికి రావాలంటే సమయం పడుతుంది.

ఇలా అన్ని బేరీజు వేసుకున్నాక ఫ్లాట్ కొనుక్కోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube