మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల వినతిపత్రం

నల్లగొండ జిల్లా:నందికొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తూ,కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు నల్లగొండ జిల్లా నాయకులు బషీర్ డిమాండ్ చేశారు.

శుక్రవారం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నందికొండ మున్సిపాలిటీ ముందు నిరసన తెలిపారు.

అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల పని గంటలను తగ్గించి 8 గంటలు ఉండేలా చూడాలని కోరారు.ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.25 లక్షలు ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో దొంతాల నాగార్జున,ఆనంద్ పాల్, గోవింద్,రోశయ్య, ఇమ్మానుయేల్,ఎస్.

Petition Of Workers To Municipal Commissioner , Municipal Commissioner, Municipa

కె తాహెర్,శివ,భాస్కర్, చిన్ని,లక్ష్మణ్,వెంకటమ్మ, కవిత,మణి,రాణి, అనురాధ,శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
Advertisement

Latest Nalgonda News