తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: డీకే శివకుమార్

నల్గొండ జిల్లా: తెలంగాణ సమాజం మార్పు కోసం చూస్తోందన్నారు.కేపీసీసీ అధ్యక్షుడు,కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను ఆయన శుక్రవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.అక్కడి నుంచి డీకే రోడ్డు మార్గాన సూర్యాపేట జిల్లాలోని కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

People Of Telangana Want Change DK Shivakumar, Telangana , DK Shivakumar, Karnat

ఈ సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే నిద్రపోర‌న్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలవుతాయని,సీఎం కుర్చీకోసం కొట్లాటలు జరగడం లేదని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని,తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.

Advertisement

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని,ప్రజలు కూడా ఇప్పటికే కేసీఆర్ ను సాగనంపడానికి సిద్ధమయ్యారన్నారు.సోనియాకు కృతజ్ఞతలు తెలపాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని,కేసీఆర్ ఫాంహౌజ్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందేనని డీకే చురకలంటించారు.

తన పేరుతో నకిలీ లెటర్ సృష్టించారని,కర్ణాటకలో ఫేక్ లెటర్‌పై ఫిర్యాదు చేశామన్నారు.తెలంగాణకు మేం డబ్బు పంపిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని,మేం డబ్బులు పంపిస్తే బీఆర్ఎస్ నిద్రపోతుందా అని ప్రశ్నించారు.

Advertisement

Latest Nalgonda News