ఎవరైనా సరే కుక్కులు, కోతులు లాంటి వాటి మరీ ఎక్కు కాకున్నా.కాస్త భయపడుతుంటారు.
చీమలకు ఎవరైనా భయపడటం చూశారా.కానీ ఓ రాష్ట్రంలోని ప్రజలు చీమలకు భయపడి ఏకంగా ఊరు వదిలే వెళ్తున్నారు.
చీమలు.చిన్నగా కుట్టడమో లేదా ఆహార పదార్థలు పాడు చేయడం లాంటివి చేస్తాయి.
అలంటి చీమలకు భయపడి ఊరు వదిలి పెట్టి పోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.అవునండీ.
ఏడు గ్రామాలపై చీమలు దాడి చేయడంతో భరించలేని ప్రజలు ఊరు ఖాళీ చేసి వెళ్లి పోతున్నారు.ఇంతకీ ఇదెక్కడ అనుకుంటున్నారా.
వివరాల్లోకి వెళ్లితే.తమిళనాడు రాష్ట్రంలోని దిండుక్కల్ జిల్లా కరంతములై అనే రిజర్వ్ ఫారెస్ట్ ఉంది.ఇక దాని పరిసర ప్రాంతాల్లో చాలా మంది గిరిజనలు నివసిస్తుంటారు.అక్కడే తమకు భూములు ఉండటంతో పంటపొలాలల్లో పనులు చేసుకుంటూ.
పశువులను సైతం పెంచుకుంటూ జీవనం కొనసాగిస్తు్నారు.అయితే ఎప్పుడూ ఎలాంటి సమస్యల్లో చిక్కుకోని వీరికి.
చీమలతో ముప్పు వచ్చింది.
అడివికి దగ్గరగా ఉండటంతో ఫారెస్ట్‌లో ఉండే పెద్ పెద్ద చీమలు దండుగా మారి ఒక్కసారిగా గ్రామాలపై దాడి చేశాయి.
అయితే ఆ చీమలు ఒంటి మీదకు దండులా పాకి, కుట్టడంతో వారికి శరీరంపై పొక్కులు వచ్చి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.అంతే కాకుండా అవి ఆహారం తీసుకరావడానికి వెళ్దామాన్నా అవి దాడి చేస్తాయని భయపడి ఏటు వెళ్లలేక పోతున్నం.
వాటి ధాటికి పశువులు సైతం ప్రాణాలు కోల్పోయాని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ చీమలను భరించలేకే ఊరు విడిచి వెళ్లి పోతున్నట్లు రిజర్వ్ ఫారస్ట్ దగ్గరలో నివసించే ప్రజలు చెప్తున్నారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న అధికారులు, చీమల వలన గాయపడిన వారిని వైద్యుల వద్దకు చికిత్స చేయించగా, ఈ చీమలు కుట్టవు కరవవు అని కానీ అవి విడుదల చేసే ఫార్మిక్ యాసిడ్ వలన దురద చర్మ పొట్టులా రాలడం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు.అలాగే ఈ యాసిడ్ జంతువుల కళ్లను ప్రభావితం చేయడం వలన అవి చనిపోయి ఉండవచ్చునని పేర్కొన్నారు.