జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్న అభిమానులకు భేతళ ప్రశ్నలా మిగిలిపోయింది.పవన్ ఎక్కడినుంచి పోటీ చేసినా ఎన్నికల్లో విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గాజువాక, భీమవరం( Gajuwaka, Bhimavaram ) నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఛాన్స్ అయితే లేదని అందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.అయితే పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారని భోగట్టా.
సర్వేలలో ఫలితాలు అనుకూలంగా ఉండటం, కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గంలో పవన్ కు గెలుపు సునాయాసమంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.పిఠాపురంలో పవన్ బరిలో నిలిస్తే ఓడించడం వైసీపీకి( YCP ) కూడా సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2009 సంవత్సరంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వంగా గీత విజయం సాధించారు.
అయితే ఇక్కడ టీడీపీ ఇన్ ఛార్జ్ గా వీ.ఎస్.ఎన్.వర్మ( V.S.N.Verma ) ఉన్నారు.ఆయన రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే మాత్రం పవన్ కు నష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తారో లేక ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.గత ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఆయన అడుగులు పడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ జనసేన( Janasena ) కనీసం 20 సీట్లలో గెలిచేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ త్వరలో పొలిటికల్ ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెంచనున్నారని తెలుస్తోంది.రాయలసీమలో జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ ఖాతాలో మూడు సినిమాలు ఉండగా ఆ సినిమాలు రిలీజ్ కావడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి.