పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!!

జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీ పార్టీ తో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత.కొద్ది నెలలకే పవన్ .బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం జరిగింది.అయితే రెండు పార్టీలు కలిసి పెద్దగా ప్రజా పోరాటాలు చేసిన సందర్భాలు లేవు.పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క చంద్రబాబు.పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడానికి సానుకూలంగానే ఉన్నట్లు ఇటీవల కుప్పం  పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.ఇటువంటి తరుణంలో టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారు అయినట్టే అనే వార్తలు ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి.

 Pawan Kalyan Gave Clarity Alliances Politics, Pawan Kalyan, Chandrababu-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.పార్టీకి సంబంధించిన కార్యనిర్వాహక సభ్యులతో టెలి కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ… పొత్తులకు సంబంధించి ప్రతి కార్యకర్త నిర్ణయం మేరకే.

ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.నా ఇష్టం వచ్చినట్లు నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు పార్టీ పొత్తులు ఉండవని అన్నారు.ఇదే తరుణంలో మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఆయా పార్టీలు జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఆరాటపడుతున్న ఈ తరుణంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఏది ఏమైనా వచ్చే ఎన్నికలకి సంబంధించి పొత్తులు విషయంలో పార్టీ ప్రతి కార్యకర్త నిర్ణయం మేరకే.

ముందుకు సాగుతామని పవన్ క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube