జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు .వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.
రెండు పార్టీలు ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. మరికొద్ది రోజుల్లో అభ్యర్థుల ప్రకటన చేసేందుకు కూడా రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.
కాకపోతే జనసేనతో పొత్తులో ఉన్న బిజెపి పరిస్థితి ఏమిటనేది సందేహంగానే మారింది.మొదట్లో టిడిపి, జనసేన తమతో కలవాల్సిందిగా బీజేపీ పై ఒత్తిడి చేశాయి.
పవన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దల వద్ద ఈ ప్రతిపాదన సైతం చేశారు.అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపితో కలిసి వెళ్లేందుకు బిజెపి పెద్దలు అంగీకారం తెలపకపోవడం తో పవన్ కూడా సైలెంట్ అయ్యారు.
ఏపీలో జనసేన పరిస్థితి మెరుగుపరుచుకోవాలన్నా, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలన్నా అది బిజెపితో సాధ్యం కాదు అనే విషయాన్ని పవన్ గుర్తించారు .
టిడిపి తో కలిసి వెళ్తేనే రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా ఉండదని భావించిన పవన్ బిజెపికి మరింత దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే అధికారికంగా పొత్తును రద్దు చేసుకునే సాహసం మాత్రం చేయలేకపోతున్నారు.ఇదిలా ఉంటే నిన్న జరిగిన యువ గళం నవశకం సభ( Yuva Galam Navasakam )లో పవన్ తన ప్రసంగంలో బిజెపితో ఇకపై కలిసి నడిచేదే లేదనే సంకేతాలను ఇచ్చారు.
పవన్ తన ప్రసంగం చివరలో బీజేపీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మాట్లాడిన మాటలు దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి( BJP )తో కలిసి వెళ్తే నష్టమే తప్ప, లాభం ఉండదనే అంచనాకు పవన్ వచ్చారు.అందుకే నిన్ను జరిగిన యువ గళం నవ శఖం సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో బిజెపి ఆశీస్సులు ఉండాలని మాత్రమే ఆకాంక్షించారు తప్ప, తమతో కలిసి రావాలనే విధంగా ఎక్కడ మాట్లాడలేదు.ప్రత్యక్షంగా నైనా పరోక్షంగా వైసీపీకి సహకారం అందించ వద్దు అనే కోణంలో పవన్ మాట్లాడినట్లుగా అర్థం అవుతుంది.