రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహానంది మండలం బుక్కాపురం సమీపంలోని పొలాల్లో టిడిపి ఆధ్వర్యంలో వరి రైతులు ఉరి తాళ్లతో ప్రదర్శన నిర్వహించారు .వరి రైతులకు సమాధి కట్టొద్దని ఉరి తాళ్ళు పట్టుకొని నిరసన చేశారు .
ఈ ఖరీఫ్ పంటలో అకాల వర్షాలు కురవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.వరికి మద్దతు ధర లేకపోవడం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు.
రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
దీనితోపాటు గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్లు రబీ సీజన్లో బోరుబావుల కింద వరి పంట సాగు చేయొద్దని సీఎం జగన్ ప్రకటించడంతో వరి రైతులకు ఉరి తాల్లే శరణ్యమని మండల టీడీపీ ఆధ్వర్యంలో ఉరి తాళ్లతో ప్రదర్శన నిర్వహించి, సీఎం జగన్ డౌన్ డౌన్ వరి పంటకు మద్దతు ధర ఇవ్వాలని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రంగుమారిన ధాన్యాన్ని కొనాలని రబీ సీజన్లో బోరుబావుల కింద వరి పంట సాగుకు అనుమతి ఇవ్వాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి కోయ్యలకు తగిలించిన ఉరి తలను మెడకు తగిలించుకుని నిరసన వ్యక్తం చేశారు.