సినిమా ఇండస్ట్రీలో హీరో,హీరోయిన్ లకు మాత్రమే కాకుండా వారి పిల్లలకు కూడా భారీగా అభిమానులు ఉన్నారు.అల్లు అర్హ, ఘట్టమనేని సితార అందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు.
సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి పిల్లలు ఎక్కడ కనిపించినా కూడా అభిమానులు ఫోటోలు దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.అంతేకాకుండా సెలబ్రిటీల పిల్లలు ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా ఏకీపారేస్తూ ఉంటారు నెటిజన్స్.
ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.
తాజాగా బాలీవుడ్ స్టార్ దంపతులు అజయ్ దేవ్‌గణ్, కాజోల్‌ల ( Ajay Devgan , Kajol )కూతురు నిసా దేవ్‌గణ్( Nisa Devgan )ను పాపరజీలు ఇబ్బంది పెట్టారు.ఆమె పేరును తప్పుగా పలకటంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు.నిసా దేవ్‌గణ్ తాజాగా ఒక రెస్టారెంట్‌కు వెల్లింది.
తరువాత ముగించుకుని బయటకు వచ్చిన ఆమెను కొందరు పాపరజీలు ఫొటోలు తీయటం మొదలుపెట్టారు.నిసా కూడా నవ్వుతూ వారి వైపు చూస్తూ అక్కడి నుంచి తన కారు ఉన్న చోటుకు నడవసాగారు.
ఈ నేపథ్యంలోనే కొందరు నైసా( Nysa ).నైసా అంటూ ఆమెను పిలవటం మొదలుపెట్టారు.ఆమె అవేవీ పట్టించుకోకుండా కారులోకి కూర్చుంది.
ఆ వెంటనే నా పేరు నిసా అంటూ నవ్వుతూ వారిపై అసహనం వ్యక్తం నిసా.దీంతో పాపరజీలు ఆమెకు సారీ చెప్పారు.నిసా కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.
ఆమె పేరు నిసా అంట.నైసా కాదు.ఫొటోల కోసం వచ్చినపుడు పేరు సరిగ్గా తెలుసుకుని రావాలి.సెలెబ్రిటీల పిల్లలకు కొంచెం పొగరు ఎక్కువ అంటూ కామెంట్లు చేస్తున్నారు.