ప్రైవేట్ పై వేటు

నల్లగొండ జిల్లా:ప్రైవేటు దవాఖానల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది.

అందులో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులలో జిల్లా వైద్యశాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.

అనుమతులు,మౌలికవసతులు పాటించని ఐదు ల్యాబ్స్ ను,ఒక హాస్పటల్ ను సీజ్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ అనుమతులు లేని, నిబంధనలు పాటించని ఆస్పత్రులను,ల్యాబ్స్ ను సీజ్‌ చేసి,నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Not A Private Pie-ప్రైవేట్ పై వేటు-Nalgonda-Telugu T

Latest Nalgonda News