చాలా మందికి ఇష్టమైన పెంపుడు జంతువుల్లో ముందుడేది శునకం.ఎంతో మంది వీటిని పెంచుకుంటూ ఉంటారు.
మరికొందరేమో వీటని చూస్తే భయపడిపోతుంటారు.దగ్గరకు కూడా రావడానికి ఇష్టపడరు.
అది మనపైకి దాడి చేసేందుకు వస్తే ఏదమై కట్టె లేదా రాయితో కొడ్తున్నట్లు బెదిరించి అక్కడి నుంచి వెళ్లగొడ్తుంటాం.అయితే ఓ వ్యక్తి మాత్రం కుక్క పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడు.
అతడిపై జోధ్ పూర్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.అయితే అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జోధ్ పుర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జన్ గా పని చేస్తున్న డాక్టర్ రజనీష్ గాల్వా.తాడుతో వీధి కుక్కను కారుకు కట్టేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు.
అయితే దీన్ని కొందరు యువకులు వీడియో తీని నెట్టింట పెట్టారు.అది కాస్తా వైరల్ గా మారింది.
కారును వేగంగా పోనివ్వడంతో దానికి సమానంగా పరిగెత్తలేక ఆ శునకం తీవ్ర అవస్థలు పడింది.కాసేపటికి కుక్కకు ఓ కాలు విరిగింది.
మరో కాలికి, మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి.వీడియో చూసి ప్రతీ ఒక్కరూ డాక్టర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మనిషివా, పశువ్వా అంటూ ఫైర్ అవుతున్నారు.డాగ్ హోమ్ ఫౌండేషన్ ప్రతినిధులు శునకాన్ని రక్షించి చికిత్స చేయించారు.
రజినీష్ పై ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని రజనీష్ ను ఆదేశించారు.
ఎస్ఎమ్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా దిలీప్ కంచావహా.