ప్రజారోగ్య సంరక్షణ చర్యల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లు.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నియమించిన వైద్యారోగ్య శాఖ

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్య సంరక్షణ చర్యలు పర్యవేక్షించేందుకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించింది.

 Nodal Officers For Monitoring Public Health Measures, Nodal Officers ,monitoring-TeluguStop.com

ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కే రమేష్ రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ జి శ్రీనివాసరావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వీరు తక్షణం ఆయా జిల్లాలకు చేరుకొని, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ అరోగ్య సంరక్షణ చర్యలు పర్యవేక్షించాలని పేర్కొంది.వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా ఔషధాలు అందుబాటులో ఉంచాలని, సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube